పావ్ భాజీ

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: నలభయ్ నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1512
Likes :

Preparation Method

  • పచ్చి బఠాణి, బంగాళా దుంపలు, క్యాబేజి పువ్వు ని ఉడకబెట్టుకోవాలి.
  • బంగాళా దుంపలు ను తొక్క తీసి మెదుపుకోవాలి.
  • కాప్సికం ని చిన్న ముక్కలుగ తరగాలి.
  • రెండు ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక ఉల్లి పాయ ని చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • పచ్చి మిరప ని, టమాటో ని కూడా తరిగి ఉంచుకోవాలి.
  • ఒక పాన్ లో వెన్న వేసి అది వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ  ముక్కలని వేసి దోరగా వేయించాలి.
  • అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసి వేయించాలి.
  • అందులోనే కాప్సికం ముక్కలని కూడా వేసి నాలుగు నిమిషాల వరకు వేయించాలి.
  • టమాటో ముక్కలు ని కూడా వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
  • కారం, పావ్ భాజీ మసాలా పొడి వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు, మెదిపి ఉంచిన బంగాళా దుంపలు వేసి కలుపుకోవాలి.
  • తర్వాత తగినంత నీళ్లు వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కసూరి మేతి పొడి వేసి బాగా వేయించి స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
  • పావ్ రొట్టె ని రెండు నిలువుగ సమ భాగాలుగా  చేసుకోవాలి.
  • పాన్ ని వేడి చేసుకొని తగినంత వెన్న వేసి రొట్టె ని ఒకటి నుండి రెండు నిముషాలు వరకు కాల్చుకోవాలి.
  • రొట్టె అంచులకు వెన్న రాసుకోవాలి.
  • వెన్న తో కాల్చిన రొట్టె ని ఒక ప్లేట్ లో ఉంచాలి.
  • దాని ఫై ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఆకులను వేసుకోవాలి.
  • వేడిగా ఉన్న పావ్ మసాలా మరియు నిమ్మకాయ ముక్కల తో అందించాలి.

You Might Also Like

Engineered By ZITIMA