Preparation Time: 2 గంటలు 30 నిముషాలు Cooking Time: 40 నిముషాలు
Hits : 781 Likes :
Ingredients
చిన్నిగా పప్పు 500 గ్రాములు
పెద్ద ఉల్లిపాయ 7
వెల్లులి 6 పాయలు
టమాటో 400 గ్రాములు
ఎండుమిరపకాయలు 5
పచ్చిమిరపకాయలు 6
పసుపు 1 చిన్న చెంచా
కొత్తిమీర 1 పెద్ద చెంచా
అల్లం 1 అంగుళం
సోంపు 1 చిన్న చెంచా
ఇలాచీ 3
దాల్చిన చెక్క 1
లవంగ త్రీ
పుట్నాల పొడి 1 పెద్ద చెంచా
ఉప్పు తగినంత
ఇదయం నువ్వుల నూనె 500 మిల్
Preparation Method
చేనిగాపపు ని 2 గంటల పాటు నానపెట్టాలి
నానపెట్టిన పప్పు ని గట్టి గా ఉప్పు వేసి రుబ్బిపెట్టుకోవాలి
పిండి ని చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనెలో వేయించుకొని పక్కనపెట్టుకోవాలి
2 ఉల్లిపాయలు ,అల్లం ,వెల్లులి ఎండుమిరపకాయలు ,పచ్చిమిరపకాయలు ,దాల్చిన చెక్క ,సోంపు,ఇలాచీ ,పుట్నాల పప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి
ఒక గిన్నెలో నీళ్లు మరిగాక టమాటో లు వేసి 5-10 నిముషాలు మరిగించి ,పొట్టు తీసి గుజ్జులా తయారుచేసుకొని పెట్టుకోవాలి
బాణీలో నూనె వెడ్డెక్కినాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు ,వెల్లులి వేసి వేయించుకొని దీనిలో రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి పచ్చివాసనా పోయేదాకా వేయించుకోవాలి
దీనిలో టమాటో గుజ్జు వేసి ,600 మిల్ నీళ్లు పోసి ,ఉప్పు ,పసుపు వేసి వేయించుకోవాలి
గ్రేవీ మరగడం మోద్దలు అయ్యాక ఫ్రై చేసుకున్న వడలు వేసి మరిగించుకోవాలి
గ్రేవీ గట్టి పడేదాకా ఉంచి కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి