కేరళ చేపల కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 1138
Likes :

Preparation Method

  • ఐదు వందల గ్రాముల చేపలు మీకు నచ్చినవి తీసుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయని ఒకే పరిమాణం లో బాగా తరగాలి.
  • వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి ఒకే పరిమాణం లో తరగాలి.
  • టొమాటోలని,ఎర్ర చిన్న  ఉల్లిపాయని,సోపు గింజల్ని,జిలకర్రని,పసుపుని,కారంని మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరితురుము వేసుకొని రుబ్బుకోవాలి.
  • చింతపండుని నానబెట్టి పులుసు తియ్యాలి.
  • మిగతా కొబ్బరి తురుమిని కొబ్బరిపాలుగా తీసుకోవాలి.
  • అల్లంని ఒకే పరిమాణంలో అగ్గిపెట్టె లో పుల్లలుగా తరగాలి.
  • ఒక మందపాటిపెనం లో ఇదయంనువ్వులనూనె తీసుకోని,అది వేడి అయ్యాక అల్లం,వెల్లులి,ఉల్లిపాయ,కరివేపాకు వేసి వేయించాలి.
  • వేయించాక,మసాలా ముద్ద వేసి,సరిపడినంత వేడి నీళ్ళని మరియు ఉప్పుని వేసుకోవాలి.
  • ఇప్పుడు చింతపండు పులుసు మరియు కొబ్బరిపాలు వేయాలి.
  • దానిని అలా ఉడకనివ్వాలి.
  • ఇగురు చిక్కబడిన తరవాత,చేపలు వేసి ఉడకనివ్వాలి.
  • పొయ్యమీద నుంచి దించి మరియు వేడిగా వడ్డించుకోవాలి.

Choose Your Favorite Kerala Recipes

Engineered By ZITIMA