చికెన్ హరియాలి కబాబ్

Spread The Taste
Serves
3
Preparation Time: 50 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 4694
Likes :

Preparation Method

  • చికెన్ కి ఉప్పు, వెన్న, నిమ్మరసం మరియు కారం కలిపి 20 నిముషాలు ఊరబెట్టాలి.
  • మెంతికూర, పాలకూర కలిపి ఉడికించుకోవాలి.
  • ఉడికించిన మెంతికూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఊరబెట్టిన చికెన్ ముక్కలకు గరం మసాలా, పెరుగు, కారం, మెత్తగా రుబ్బుకున్న మిశ్రమం కలిపి మరొక 20  నిముషాలు ఊరబెట్టాలి.
  • నీళ్ళల్లో వెదురు పుల్లలు (bamboo skewers) 5  నిముషాల సేపు నానపెట్టాలి.
  • వెదురు పుల్లలకు నూనె రాసి, ఊరబెట్టిన చికెన్ ముక్కలు గుచ్చి ఒకపక్కకు పెట్టుకోవాలి.
  • ఒవేన్ ని ముందుగా 350°c  వద్ద వేడిచేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు గుచ్చిన  వెదురు పుల్లలు తెచ్చి ఓవెన్ లో పెట్టి 15 -18  నిముషాల వరకు బేక్ చేయాలి.
  • మధ్య మధ్యలో పుల్లలు తిప్పుకుంటూ ఉండాలి.
  • చికెన్ బాగా బేక్ అయ్యాక, వేడి వేడిగా వడ్డించాలి. 

Choose Your Favorite Hyderabad Recipes

  • హైదరాబాద్ స్పెషల్ ఫెలూదా

    View Recipe
  • మూర్గ్ క సంబంద్ పులావ్

    View Recipe
  • హైదరాబాద్ చికెన్ 65

    View Recipe
  • ఆంధ్ర చికెన్ ఇగురు

    View Recipe
Engineered By ZITIMA