మొక్క జొన్న సూప్.

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 902
Likes :

Preparation Method

  • ముందుగా మొక్క జొన్న కంకి నుంచి గింజలు వేరు చేయాలి.
  • ఒక ఆవిరి కుక్కర్ లో ఆరుకప్పుల నీళ్లు మరియు ఉప్పు వేసి ఈ గింజలను ఉడకబెట్టాలి.
  • కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత తక్కువ మంట లో ఆరు నిమిషాల వరకు వేడి చేయాలి.
  • మంట నుంచి దించేయాలి.
  • క్యారెట్ ని బాగా తురిమి పెట్టుకోవాలి.
  • మొక్క జొన్న పొడి ని కొంచం నీటి తో కలుపుకోవాలి
  • ఇలా కలుపుకున్న మొక్క జొన్న పొడి మిశ్రమం ని ఉడకబెట్టి ఉంచిన మొక్క జొన్న గింజల మిశ్రమం కి కలుపుకోవాలి.
  • ఇందులో పంచదార, అజినమోటో , వెనిగర్ మరియు తెల్ల మిరియాల పొడి ని కలుపుకోవాలి.
  • ఇలా కలిపిన తర్వాత మరల ఈ మొక్క జొన్న మిశ్రమం ని పది నిమిషాల వరకు వేడి చేయాలి.
  • తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ ని కూడా కలిపి మూడు నిమిషాల వరకు వండాలి.
  • తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • చివరగా మంట మీద నుంచి దించి ఒక సూప్ పాత్ర లో వేసి అందించాలి.
  • ఒకవేళ సూప్ మరీ నీరు లా  ఉంటె , మొక్క జొన్న పొడి మిశ్రమం ని కలుపుకోవచ్చు.
Engineered By ZITIMA