రొయ్యల వంకాయ కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1152
Likes :

Preparation Method

  • పెనం లో ఐదు టేబుల్ స్పూన్లు ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • వేడి అయ్యాక రొయ్యలు వేసి,వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
  • వంకాయలని ఒకే పరిమాణంలో తరగాలి.
  • టొమాటోలని తరగాలి.
  • కొత్తిమిర,ఆవాలు,వెల్లులి మరియు పచ్చిమిర్చితో పాటు కొన్ని నీళ్లు వేసుకొని రుబ్బుకోవాలి.
  • ముందుగా వేయించిన రొయ్యల నూనెలో ఐదు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేయాలి.
  • వంకాయ వేసి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
  • వెడల్పాటి పెనం లో ఒక టేబుల్ స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • జీలకర్ర దోరగా వేయించి,వేగాక టొమాటోలు వేసి వేయించాలి.
  • మసాలా ముద్ద వేసి,చిన్న మంటలో పెట్టి వేయించాలి.
  • సరిపడిన నీళ్ళని వేసి,ఉప్పు,పసుపు వేసి కలపాలి.
  • వేయించిన వంకాయ మరియు రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి.
  • మసాలా దగ్గరకి వచ్చేవరకు వేయించాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA