పన్నీర్ బట్టర్ మాసాల

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 1849
Likes :

Preparation Method

  • పన్నీర్ ని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయలు, అల్లం మరియు వెల్లులి అన్ని  రుబ్బుకోవాలి.
  • జీడిపప్పు రుబ్బుకోవాలి.
  • జీలకర్ర  ఆరబెట్టి వేపి దంచుకోవాలి.
  • పచ్చిమిర్చి చీల్చుకోవాలి.
  •  కాప్సికం తీసుకుని త్రిభుజాకారం లో తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలు తరుగుకోవాలి.
  • టమాటో రుబ్బి వడపోసి ఉంచుకోవాలి.
  • పాన్ వేడిచేసి రెండు టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి, ఎప్పుడైతే అది కరుగుతుందో ఉల్లిపాయలు కూడా వేసి బాగా సువాసన వచ్చేలా వేయించాలి.
  • కారం పొడి వేసుకోవాలి.
  • కొద్దీ కొద్దీగ పాలు పోస్తూ జీడిపప్పు ముద్దని కూడా వేసుకోవాలి.
  • మూడు నిమిషాలు వరకు వేయించాలి.
  • అందులో టమాటో గుజ్జు జీలకర్ర పొడి, గరం మసాలా, ఎర్రరంగు పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఐదు నిమిషాలు వరకు వేయించాలి.
  • రెండువందల మిలి.లీటర్  నీటిని పోసి మరో మూడు నిమిషాలు ఉడికించాలి .
  • కసూరి మెంతి పొడి చల్లి కలుపుకోవాలి.
  • మిగిలిన వెన్న వేడిచేసుకోవాలి.
  • తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాప్సికమ్, పన్నీర్ బాగా వేయించుకోవాలి.
  • వీటిని మాసాలకి కలపాలి.
  • మంట నుండి దించి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA