మైదా, నీళ్ళు, జీలకర్ర, తురిమిన పన్నీర్, కొత్తిమీర, తురిమిన అల్లం, మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
చేతులకు కొద్దిగా నూనె రాసుకొని, ఈ మిశ్రమాన్ని 4 భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
ఒక మందపాటి పాన్ లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసి, నూనె బాగా వేడెక్కిన తరువాత కోఫ్తా ఉండలు వేసుకొని బాగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
పులుసు తయారీ విధానం:
టమాటా, పచ్చిమిరపకాయలు మరియు అల్లం తీసుకొని మెత్తగా చేసుకోవాలి.
మైదా, ఫ్రెష్ క్రీం కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్ లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
జీలకర్ర, ఇంగువ, రుబ్బుకున్న టమాటా ముద్దా, ధనియాల పొడి, పసుపు, మరియు కారం వేసి 4 నిముషాల సేపు వేగించి, అలాగే ఉంచి పులుసు నుంచి నూనె బయటకు వచ్చేవరకు ఉడికించాలి.
ఇందులో మైదా, ఫ్రెష్ క్రీం మిశ్రమాన్ని, ఒక కప్పు నీళ్లు పోసి, ఉప్పు వేసి కలపాలి. స్టౌ మంట చిన్నది చేసుకొని 7 నిముషాల సేపు ఉంచాలి.
దీనికి గరం మసాలా పొడి, కొత్తిమీర కలపాలి.
ఒక నిముషం తరువాత కోఫ్తా ఉండలు చిన్నగా తిప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ మిశ్రమం మరగటం మొదలవుతుందో, వెంటనే స్టౌ మీదనుంచి దించి వేడి వేడిగా వడ్డించాలి.