కీమా శాండ్విచ్ ఇడ్లీ

Spread The Taste
Serves
8
Preparation Time: 3 గంటల 30 ని.
Cooking Time: 1 గంట
Hits   : 887
Likes :

Preparation Method

శాండ్విచ్ మసాలా తయారీ విధానం:
  • కీమాని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, ఉడికించిన మాంసం వేసుకొని వేయించాలి.
  • కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని వేగించాలి.
  • మసాలా ఎప్పుడైతే మాంసంకి పట్టుకుంటుందో, మంటమీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
ఇడ్లీ శాండ్విచ్ తయారీ విధానం:
  • బియ్యం మరియు మినప్పప్పుని విడివిడిగా నానపెట్టుకోవాలి.
  • బియ్యం కొంచం ముతకగా రుబ్బుకొని, మినప్పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.
  • రెండు పిండ్లు కలుపుకొని, ఉప్పు వేసి, రాత్రంతా పులవనివ్వాలి.
  • ఇడ్లీ ప్లేట్లకు ఇధయం నువ్వుల నూనె రాసుకోవాలి.
  • ఒక గరిటెడు పిండి తీసుకొని నూనె రాసుకున్న ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి.
  • ఒక టేబుల్ స్పూన్ మాంసం మసాలా వేసుకొని, దానిమీద ఇంకొక గరిటెడు ఇడ్లీ పిండి వేసుకోవాలి.
  • ఆవిరిమీద ఉడకనివ్వాలి.
  • వేడివేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA