తీపి సమోసా

Spread The Taste
Makes
15
Preparation Time: 1 గంట
Cooking Time: 20 నిముషాలు
Hits   : 2223
Likes :

Preparation Method

  • ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు తీసుకొని సరిపడా నీళ్లు పోసుకొని మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • కొబ్బరి తురుముకోవాలి.
  • ఒక పాన్లో మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని వేడిచేసి, తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి.
  • ఎప్పుడైతే తురిమిన కొబ్బరి కొద్దిగా రంగు మారుతుందో, వెంటనే గసగసాలు వేసి ఒక నిముషం సేపు వేయించాలి.
  • చల్లారనివ్వాలి.
  • తురిమి వేయించిన కొబ్బరికి పంచదార, యాలకులపొడి వేసి బాగా కలపాలి.
  • ముద్దగా చేసుకున్న పిండిలోంచి కొంత పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని, వృత్తాకారంగా నొక్కుకోవాలి.
  • తురిమిన కొబ్బరిని మధ్యలో పెట్టుకోవాలి.
  • ఒక చివరనుంచి ఇంకొక చివరకు మడిచి అర్ద వృత్తాకారంగా చేసుకోవాలి.
  • అంచులను వత్తిగాని, సమోసా కట్టర్తో గాని అంచులు మడుచుకోవాలి.
  • సమోసా కట్టర్ లేకపోతే అంచులు చేతితో అయినా మడుచుకోవచ్చు.
  • మిగిలిన పిండితో ఇలాగే సమోసాలు చేసుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వులనూనె తీసుకొని వేడిచేసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి.
  • నూనెలోంచి తీసి, వడ్డించాలి. 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA