జల్లెడలో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని పిండి జల్లెడ పట్టుకొని, వచ్చిన నూకను పక్కన పెట్టుకోవాలి.
మరలా ఒక సన్నని జల్లెడ తీసుకొని జల్లడ పట్టుకోవాలి.
అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని, రెండు టీస్పూన్ల నీళ్లు పోసుకొని, పొడి చేసుకున్న బెల్లం వేసి పాకం తయారు చేయాలి.
పాకం చూడటం కోసం, ఒక మూతలో నీళ్లు తీసుకొని అందులో రెండు చుక్కల పాకం వెయ్యాలి. పాకం నీళ్ళల్లో కరగకుండా, ఉండ కట్టడానికి వీలుగా ఉంటే పాకం తయ్యారు అయినట్లే.
పాకంలో జల్లెడ పట్టుకున్న బియ్యం పిండి పోసుకోవాలి.
ఇందులో గసగసాలు, యాలకుల పొడి, నెయ్యి వేసుకొని బాగా కలపాలి.
పాకం నుంచి చిన్న ఉండ తీసుకొని, నూనె రాసుకున్న అరటి ఆకు మీద ఒత్తుకోవాలి.
గుండ్రంగా, కొంచం మందంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా ఒక అయిదు , ఆరు చేసుకొని పెట్టుకోవాలి.
అడుగు మందంగా ఉన్న ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె వేడిచేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత, చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఒక గరిటెడు నూనె తీసుకొని అరిసెల మీద పోసుకోవాలి.
ఒక వైపు అరిసె కాలిన తరువాత, రెండవ వైపు తిప్పుకొని కాల్చుకోవాలి.
అరిసె రెండువైపులా ఉడికిన తరువాత, రెండు గరిటెల మధ్యలో అరిసె తీసుకొని ఎక్కువగా ఉన్న నూనె తీసివేయాలి, ఇలా చేయటం వాళ్ళ అరిసె మృదువుగా ఉంటుంది.
ఇదే విధంగా మిగిలిన పిండితో అరిసెలు చేసుకొని, ఎక్కువగా ఉన్న నూనెను వత్తి తీసేసుకొని, వడ్డించండి.