మసాలా కోడిగుడ్డు అట్టు

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 ని
Hits   : 1293
Likes :

Preparation Method

  • ఒక గిన్నెలో కోడిగుడ్లు పగలకొట్టి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా గిలకొట్టాలి.
  • ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీరను సన్నగా కోసుకోవాలి.
  • ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసి, ఆవాలు వేసి పోపు పెట్టి, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర వేసి బాగా వేయించాలి.
  • అన్ని ముక్కలు బాగా వేగిన తరువాత, మంటమీద నుంచి దింపి కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • దోశల పెనంలో కొద్దిగా నూనె వేసుకొని వేడిచేసి, గరిటె సహాయంతో గుడ్డు మిశ్రమాన్ని వేయాలి.
  • కొంచం ఎర్రగా కాలిన తరువాత, అట్టుని రెండవ వైపుకి తిప్పుకొని ఒకటి రెండు నిముషాలు అలాగే ఉంచాలి.
  • అట్టు బాగా కాలిన తరువాత, వేడివేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA