బంగాళాదుంప మసాలా దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 879
Likes :

Preparation Method

  • ప్రెషర్ కూక్కర్లో బంగాళాదుంపలు తీసుకొని ఉడికించాలి. బంగాళాదుంపల పొట్టు తీసి, మెత్తగా చేసుకోవాలి.
  •  ఉల్లిపాయలు సన్నగా, పొడవుగా కోసుకోవాలి.
  • పచ్చి మిరపకాయలు మధ్యకు చీల్చుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె  తీసుకొని వేడిచేసుకోవాలి.
  • ఆవాలు, కరివేపాకు, శనగపప్పు వేసి పోపు పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు వేసి కొద్దిగా వేయించాలి.
  • సరిపడా నీళ్లు పోసుకొని, మెత్తగా చేసుకొన్న బంగాళాదుంపలు, పసుపు వేసుకోవాలి.
  • మసాలా దగ్గరకు అవ్వగానే, మంట మీదనుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకోవాలి.
  • ఒక గరిటెడు పిండి తీసుకొని, పెనం మధ్యలోంచి అంచుల వరకు పిండిని పరచాలి.
  • ఇధయం నువ్వుల నూనె తీసుకొని, దోశ అంచుల మీద చల్లుకోవాలి.
  • ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప మసాలా తీసుకొని, దోశ మొత్తం పరచండి.
  • ఎర్రగా కాలిన దోశని మధ్యకు మడిచి, వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA