పిజ్జా దోశ

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 1793
Likes :

Preparation Method

  • ఒక గిన్నెలోకి దోశల పిండి తీసుకోవాలి.
  • ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలి.
  • క్యాప్సికములో గింజలు తీసివేసి, త్రికోణం ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.
  • బేబీ కార్న్ మరియు క్యారెట్ ని, గుండ్రంగా పలచని ముక్కలుగా కోసుకోవాలి.
  • కోడికూరకు ఉప్పు కలిపి ఉడికించి పెట్టుకోవాలి.
పిజ్జా సాస్ తయారీ విధానం:
  •  టమాటాలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని వెన్నలో వేయించుకొని, నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి.
దోశలో నింపటం కోసం:
  • ఒక పాన్ లో వెన్న తీసుకొని వేడిచేసి, అది కరుగుతున్న సమయంలో ఉల్లిపాయలు వేసి పారదర్శకంగా అయ్యేవరకు వేయించాలి.
  • బేబీ కార్న్, క్యారెట్, కాప్సికం ఒక్కొక్కటిగా వేసి ఉప్పు చల్లుకొని, వేయించుకోవాలి.
  • ఇందులో ఉడికించిన కోడికూర ముక్కలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, పెనం వేడయ్యాక, ఒక గరిటెడు దోశల పిండి తీసుకొని కొంచం మందంగా దోశ వేసుకోవాలి.
  • ఒక టీస్పూన్ పిజ్జా సాస్ తీసుకొని దోశ మీద పరచండి.
  • ఒక రెండు మూడు టీస్పూన్స్ వేయించిన మసాలా తీసుకొని దోశ మీద పరచాలి.
  • ఛీజ్ మరియు ఎండుమిరపకాయ పలుకులు దోశ మసాలా మీద చల్లి మూత పెట్టుకోవాలి.
  • ఒక 7 నిముషాలు ఇలాగే ఉంచాలి.
  • మూతను తీసి, వేడి వేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA