మైసూర్ మసాలా దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 3 గంటల 15 నిముషాలురీ
Cooking Time: 6 ని. ఒక దోశకి
Hits   : 4025
Likes :

Preparation Method

పిండి తయారీ విధానం: 

  • బియ్యం, మినపప్పు, కందిపప్పు, మెంతులు కలిపి మూడు గంటలసేపు నానపెట్టాలి.
  • అటుకులు విడిగా నాన్నపెట్టాలి.
  • బియ్యం, మినపప్పు, కందిపప్పు, మెంతులు, అటుకులు కలిపి ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • రుబ్బుకున్న pindilo రవ్వ వేసి బాగా కలుపుకోవాలి.
మసాలా తయారీ విధానం:
  • బంగాళాదుంపలు ఉడికించి, పొట్టు తీసుకోవాలి.
  • ఉడికించిన బంగాళాదుంపలకు ఉప్పు కలిపి మెత్తగా చేసుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయలను పొడువుగా సన్నగా కోసుకోవాలి.
  • పచ్చిమిరపకాయలు మధ్యకు చీల్చాలి. 
  • ఒక పాన్లో కొద్దిగా ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
  • ఆవాలు మరియు శనగపప్పు వేసి పోపు పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి కొద్దిగా వేయించాలి.
  • సరిపడా నీళ్ళుపోసి, మరిగిచాలి.
  • ఇందులో ఉప్పు, పసుపు, బంగాళాదుంపలు వేసి వేయించుకోవాలి.
  • మసాలా దగ్గరపడిన తరువాత, మంట మీదనుంచి తీసి పక్కన పెట్టుకోండి.
  • కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి రుబ్బుకొని పచ్చడి తయారు చేసుకోవాలి.
  • దోశల పెనం వేడి చేసుకొని, వేడెక్కిన పెనం మీద ఒక గరిటెడు పిండివేసి గుండ్రంగా తిప్పాలి.
  • ఇధయం నువ్వుల నూనె దోశ అంచులమీద చల్లాలి. దోశ ఎర్రగా కాలిన తరువాత, పచ్చడి దానిమీద రాయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప మసాలా తీసుకొని దోశ మొత్తం మీద పరచండి.
  • దోశ ఎర్రగా కాలేవరకు అలాగే ఉంచండి.
  • ఒక టీస్పూన్ వెన్న తీసుకొని దోశ మీదవేసి, దోశని మధ్యకు మడిచి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA