పుట్టగొడుగుల దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 2349
Likes :

Preparation Method

  • పుట్టగొడుగులకు3 చిటికెల ఉప్పు, 2 చుక్కల నిమ్మకాయ రసం కలిపి రెండు నిముషాలు ఉంచి, పుట్టగొడుగులను శుభ్రంగా కడగాలి.
  • పుట్టగొడుగులను రెండు ముక్కలుగా కోసుకోవాలి.
  • ఉల్లిపాయలు ముక్కలు కోసుకోవాలి.
  • ఒక పాన్ లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేయాలి.
  • ఉల్లిపాయలు వేసి కలపాలి.
  • అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
  • వేగినాక, పుట్టగొడుగులు వేసి రెండు నిముషాలసేపు వేయించాలి.
  • కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి బాగా ఉడికించాలి. పుట్టగొడుగులు ఉడికిన తరువాత గరం మసాలా వేసి పొడి పొడిగా అయ్యే వరకు వేయించాలి.
  • మంట మీదనుంచి తీసి, పక్కన పెట్టుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకోవాలి.
  • దోశల పెనం బాగా వేడెక్కిన తరువాత, ఒక గరిటెడు దోశల పిండి తీసుకొని గుండ్రంగా పిండిని పరచండి.
  • దోశ అంచుల మీద ఇధయం నువ్వుల నూనె చల్లుకోవాలి.
  • స్టౌ మంటను తగ్గించుకోవాలి.
  • ఒక రెండు మూడు టీస్పూన్స్ పుట్టగొడుగుల మసాలా తీసుకొని దోశ మొత్తం మీద పరచాలి.
  • దోశ ఎర్రగా, కరకర అయ్యాక, మధ్యకు మడిచి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA